Sri Veereswara Saisadan
గలగలపారే గోదావరి, పచ్చని పైర్లు, కొబ్బరి తోటలు, సొగసుగా సాగే కాలువలు, గోదావరి - సాగర సంగమం.. ఇలా ఒకటా, రెండా ఎన్నో అందాలు కోనసీమ సొంతం.గలగలపారే గోదావరి, పచ్చని పైర్లు, కొబ్బరి తోటలు, సొగసుగా సాగే కాలువలు, గోదావరి - సాగర సంగమం.. ఇలా ఒకటా, రెండా ఎన్నో అందాలు కోనసీమ సొంతం. ప్రకృతి చెక్కిన శిల్పంలా.. స్వర్గసీమను తలపించే కోనసీమ గురించి ఎంత చెప్పినా తక్కువే. అంతేకాదు, కోనసీమ సాంప్రదాయాలు, మర్యాదలు పర్యాటకులను కట్టిపడేస్తాయి.కోనసీమలో ప్రకృతి అందాలే కాదు.. ఆధ్యాత్మికతను పంచే పుణ్యక్షేత్రాలు కూడా ఉన్నాయి. దిండి నుంచి హోప్ ఐలాండ్ వరకు ప్రతి ఒక్కటి ఇక్కడ ప్రత్యేకమే. ప్రతి అణువు అద్భుతమే. అయితే, కొనసీమలోని పర్యాటక ప్రాంతాల గురించి తెలుసుకునే ముందు.. ఈ ప్రాంతం ప్రత్యేకతను గురించి తప్పకుండా తెలుసుకోవాలి.
పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల మధ్య ప్రవహించే గోదావరి నది దవళేశ్వరం బ్యారేజీ నుంచి వశిష్ట, గౌతమీ నదులుగా విడిపోయింది. ఈ రెండు పాయల మధ్యలో ఉండే ప్రాంతాన్ని కోనసీమగా పిలుస్తారు. కోన అంటే మూల అని అర్థం. సీమ అంటే ప్రదేశమని అర్థం. కోనసీమకు ఉత్తరంలో గౌతమి, దక్షిణంలో వశిష్ట గోదావరి నదులు హద్దులు. తూర్పు వైపున బంగాళాఖాతం ఉంటుంది. ఈ ప్రాంతం సముద్రం, గోదావరి మధ్యలో త్రిభుజాకారంలో ఉన్న దీవిలా కనిపిస్తుంది. కోనసీమలో ప్రధాన ప్రాంతాలు అమలాపురం, రావులపాలెం, రాజోలు, ముమ్మిడివరం, ముక్తేశ్వరం, కొత్తపేట, అంబాజీపేట.చూడదగిన ప్రాంతాలు:
దిండి రిసార్ట్: సొగసుగా కనిపించే కొబ్బరి చెట్ల నడుమ.. గోదావరిలోని పచ్చని లంకలకు చేరువలో ఉన్న దిండి రిసార్ట్ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ప్రశాంత వాతావరణంలో హాయిగా గడపాలని భావించేవారికి దిండి రిసార్ట్ చక్కని ఆతిథ్యం ఇస్తుంది. రాజమండ్రికి 82 కిమీల దూరంలో ఉన్న దిండిలో హరిత కోకోనట్ రిసార్ట్‌లో వాటర్ వాకింగ్, కమెండోనెట్, విలు విద్య తదితర వినోదాలతోపాటు స్విమ్మింగ్‌పూల్ కూడా అందుబాటులో ఉంది. ఇక్కడ హౌస్ బోట్‌లో షికార్ మరపురాని అనుభూతి ఇస్తుంది.అంతర్వేది: వశిష్ట గోదావరి సాగర ప్రవేశం చేసే ప్రాంతం ఇది. నర్శింహ క్షేత్రాల్లో ఒకటైన లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం ఇక్కడ ఉంది. అంతర్వేదిలో గోదావరి నది సముద్రంలో కలిసే సంగమ ప్రదేశం చూడదగినది. ఇక్కడి అన్నా చెల్లెల్ల గట్టు వద్ద నీరు వేర్వేరు రంగుల్లో కనిపిస్తుంది. పర్యాటకులు బస చేసేందుకు ఇక్కడ హరివిల్లు రిసార్ట్, సోంపల్లి ప్రైవేట్ రిసార్ట్‌లు అందుబాటులో ఉన్నాయి.
ద్రాక్షారామం: ప్రశిద్ధ శైవ క్షేత్రమైన ద్రాక్షారామం గౌతమీ నదీ తీరంలోని కోటిపల్లికి సమీపంలో ఉంది. ఇక్కడ భీమేశ్వరుడు స్పటిక లింగంలో పూజలు అందుకుంటున్నాడు. 8వ శతాబ్దం నాటి ఈ ఆలయం త్రిలింగ క్షేత్రాలు, పంచారామాల్లో ఒకటిగా ప్రశిద్ధిగాంచింది. శివుడు.. సూర్య భగవానుడితో పూజలందించుకున్న పుణ్యక్షేత్రంగాను ఈ భీమేశ్వర ఆలయానికి పేరుంది.హోప్ ఐలాండ్: కాకినాడ పోర్టులోఉంది. గోదావరి నదీ తీరం నుంచి 18 కిమీలు ప్రయాణిస్తే హోప్ ఐలాండ్‌కు చేరుకోవచ్చు. తీరం నుంచి ఐలాండ్‌కు సముద్ర ప్రయాణం ఆహ్లాదాన్ని అందిస్తుంది. ఈ ద్వీపం పూర్తిస్థాయిలో అభివృద్ధికి నోచుకోలేదు. గోదావరి నది నుంచి కొట్టుకొచ్చే ఇసుక క్రమేనా ద్వీపంలా ఏర్పడి పర్యాటకులను ఆకట్టుకుంటోంది.ఇంకా ఎన్నో విశేషాలు: